బ్లాక్‌ మండే - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 13 June 2022

బ్లాక్‌ మండే


స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. 15వందల పాయింట్లకు పైగా నష్ట పోయిన సెన్సెక్స్, 450 పాయింట్లు కోల్పోలయిన నిఫ్టీ మరో బ్లాక్ మండే నమోదు చేశాయి. మెటల్, ఐటీ, బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనా, పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి బలహీనపడడం సెన్సెక్స్, నిఫ్టీ పతనాన్ని శాసించాయి. సెన్సెక్స్ 52వేల734 పాయింట్ల కనిష్టస్థాయికి, నిఫ్టీ 15వేల749 పాయింట్లకు పడిపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ , అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్స్ భారీ నష్టాలు నమోదుచేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం, రూపాయి బలహీనపడడం, అంతర్జాతీయ పరిణామాలు మదుపుదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే మార్కెట్లు నష్టపోతున్న సమయం దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment