మాస్కులు పెట్టుకోకపోతే విమానం నుంచి దింపేయండి!

Telugu Lo Computer
0


దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ కట్టడి చర్యలకు సిద్ధమైంది. విమానాల్లో మాస్కులు ధరించని ప్యాసింజర్లను ఆటంకంగా భావించి విమానం నుంచి దించేయవచ్చునని విమాన ప్రయాణికులను హెచ్చరిస్తూ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నూతన మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్ నియమావళిని పాటించాల్సిందేనని వివరించింది. ఎయిర్‌పోర్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్ అధికారులు కొవిడ్ నిబంధనలను అమలుపరుస్తారని తెలిపింది. కొవిడ్ సేఫ్టీ నిబంధలను ఉల్లంఘించే ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే డీజీసీఏ ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలు పాటించని ప్రయాణికులను 'నో-ఫ్లై' జాబితాలో చేర్చవచ్చునని, తదుపరి చర్యల కోసం సెక్యూరిటీ ఏజెన్సీలకు అప్పగించవచ్చునని ఢిల్లీ హైకోర్ట్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)