అప్పు తిరిగి చెల్లించమన్నందుకు హతమార్చారు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 20 June 2022

అప్పు తిరిగి చెల్లించమన్నందుకు హతమార్చారు !


తమిళనాడు లోని మదురై జిల్లా సీఎంఆర్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన మారిముత్తు (25) తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలోని సిప్‌కాట్‌లో ఉంటూ అక్కడే ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయన తన సొంతూరుకు వెళ్ళేందు కు మే 25న సెలవు పెట్టి బయలుదేరగా, 28వ తేదీ వరకు కూడా ఇంటికి చేరుకోలేదు. దీంతో మారిముత్తు తండ్రి ఫిర్యాదు మేరకు గుమ్మిడిపూండి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మారిముత్తు సెల్‌ఫోన్‌ను ట్రేస్‌ చేయగా అది చివరగా తిరునెల్వేలిలో చూపించింది. అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం పోలీసులకు అసలు నిజం తెలిసింది. కొన్నేళ్ళక్రితం ఫేస్‌బుక్‌ ద్వారా రాగిణి అనే మహిళతో మారిముత్తుకు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఆమెకు ఇచ్చిన రూ.5 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించమని అడిగినందుకు ఆమె, తన ప్రియుడు, స్నేహితులతో కలిసి మారిముత్తును హతమార్చింది.. దీంతో పోలీసులుై, నెల్లైకు చెందిన రాగిణి స్నేహితులు ఇళవరసి, ఇసైక్కి రాజా, రవికుమార్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రాగిణి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments:

Post a Comment