10 ప్రైవేట్ జెట్ లకు అధిపతి కనికా టెక్రీవాల్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 20 June 2022

10 ప్రైవేట్ జెట్ లకు అధిపతి కనికా టెక్రీవాల్


ఒంటరిగా పోరాడి, గెలిచిన కొద్ది మంది మహిళల్లో జెట్ సెట్ గో వ్యవస్థాపకురాలు కనికా టెక్రీవాల్ ఒకరు. మనదేశంలో ప్రైవేట్‌ జెట్‌ల సంఖ్య చాలా తక్కుగా, అంతగా అందుబాటులో లేని రోజుల నుంచి ఆమెకు విమానయాన రంగం గురించి బాగా తెలుసు. భారత్‌తో పాటు విదేశీ సంస్థలలో కూడా ఈ రంగానికి సంబంధించి ఆమె పని చేసింది. ఎన్నో సంవత్సరాలుపాటు పనిచేసిన అనుభవం జెట్‌సెట్‌గో ఏర్పాటుకు దారి తీసింది. గత కొన్నేళ్లుగా ఈ రంగానికి చెందిన కస్టమర్లలో తెలియని విసుగు, చికాకు కనిపిస్తోందనేది ఆమె భావన. ముఖ్యంగా చార్టర్‌ బ్రోకర్లను, ఆపరేటర్లను కలిసినప్పుడు ఇది మరీ స్పష్టంగా తెలుస్తుందని అంటారామె. ప్రైవేట్‌ జెట్‌ కావాలనుకున్న కస్టమర్‌ సంబంధిత బ్రోకరునో, ఎయిర్‌ క్రాఫ్ట్ ఆపరేటర్‌నో కలవాలి. బ్రోకర్లు సూచించే చార్టర్ల విషయానికొస్తే వారికి కమిషన్‌ ఎక్కువగా వచ్చే వాటినే చెబుతుంటారు. కస్టమర్‌ అవసరాల కన్నా వారికొచ్చే కమిషనే ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తుంటారు బ్రోకర్లు. పారదర్శకత లోపించడం, చార్టర్లు అందుబాటులో లేకపోవడంతో కస్టమర్లు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ఉండాల్సిన దాని కన్నా చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటువంటి సమస్యల నేపథ్యంలో ప్రొఫెనల్‌ చార్టర్‌ సర్వీస్‌ను అందించే సంస్థలు, పారద్శర్శకంగా చార్జీలు వసూలు చేసే సంస్థలు వస్తే బాగుంటుందన్న ఆలోచన కనీకా మెదడుకు తట్టింది. భారత్‌లో ఏవియేషన్‌ రంగం ఇంకా పూర్తిగా అభివృద్ధి సాధించలేదని భావించిన కనికా బ్రోకర్లకు లాభం చేకూర్చే చార్టర్లనే వినియోగదారులకు సూచిస్తుండటంపై దృష్టి పెట్టారు. దీనికి చెక్‌ పెట్టేందుకే తాము జెట్‌సెట్‌గోను తీసుకువచ్చేందుకు కృషి చేశామని కనికా చెబుతారు.  అంతేకాదు జెట్‌సెట్‌గో ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందని టెక్రీ చెప్పారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన టెక్రీవాల్, ఆమె స్నేహితుడు సుధీర్ పెర్ల తో కలిసి ఈ కంపెనీని స్థాపించారు. సనాతన మార్వాడీ కుటుంబంలో పుట్టిన ఆమె తండ్రి రియల్ ఎస్టేట్, కెమికల్ వ్యాపారం చేసేవారు. దక్షిణ భారతదేశంలో బోర్డింగ్ పాఠశాల విద్యనభ్యసించిన కనికా ఆ తరువాత ఆర్థికశాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేషన్, డిజైన్‌లో డిప్లొమా ముంబైలో పూర్తిచేశారు. 

No comments:

Post a Comment