బిర్యాని, పులావ్ మధ్య తేడా ?

Telugu Lo Computer
0


హైదరాబాద్ బిర్యాని బాగా ఫేమస్ అయిన తర్వాత చాలా మంది బిర్యానిని యూట్యూబ్ లో చూసి తమ ఇళ్ళల్లో కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. చాలా మందికి బిర్యానికి పులావ్ కి మధ్య తేడా తెలియదు. పులావ్ కు బిర్యానికి మధ్య ఉండే ప్రధాన తేడా పులావులో మనంవేసే ఇన్ గ్రేడియెంట్స్ అన్నీ తాలింపు (బాగారా) పెట్టే సమయంలోనే అందులో వేసేసి ఆ తర్వాత బియ్యం, నీరు పోసి వండుతారు. కానీ బిర్యానీలో అలా అది బిన్నంగా వండుతారు. దీనికోసం బియ్యాన్ని వేరుగా 3/4 వంతు ఉడికిస్తారు. ఇక ఇందులో వేసే కూర అంటే చికన్ సహా మటన్, చేప, రొయ్యలు, కూరగాయలు వంటివి వేరుగా కూర మాదిరి చేస్తారు. ఈ కూరను కూడా 3/4 వంతు ఉడికించి పెట్టిన అన్నంలో లేయర్స్ గా వేసి ఆ గిన్నె పైన గట్టిగా మూత పెట్టి మీడియం మంటపైన ఓ అరగంట పాటు ఆన్నంలో ఆవిరి పట్టే వరకు ఉడికిస్తారు. పచ్చి చికెన్, పచ్చి మటన్ తో కచ్చా ఘోష్ కీ బిర్యానీ / ధం బిర్యానీ చేసే లా అయితే గనుక ఆ పచ్చి మటన్/చికెన్ ను మసాలాలతో మ్యారినేట్ చేసి, ఆ పచ్చి కూర పైన 3/4 వంతు ఉడికిన బియ్యం వేసి మూత పెట్టి దమ్ము పట్టే వరకు ఉంచుతారు. ఇంకా పులావ్లో వేసే మసాలాలు బిర్యానీలో వేస్ మసాలాలలో కూడా కాస్త తేడాలు ఉంటాయి. రంగు, రుచిలో కూడా తేడాలు ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)