అగ్నివీరులను బీజేపీ కార్యాలయాల్లో గార్డులుగా తీసుకుంటాం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 June 2022

అగ్నివీరులను బీజేపీ కార్యాలయాల్లో గార్డులుగా తీసుకుంటాం !


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ మీడియాతో మాట్లాడుతూ 'అగ్నివీరులు మిలటరీలో నాలుగేళ్లు శిక్షణ పొంది సర్వీసు నుంచి బయటకు వచ్చేటప్పుడు రూ.11 లక్షలు పొందుతారు. అగ్నివీర్ బాడ్జి కూడా ఉంటుంది. బీజేపీ కార్యాలయానికి సెక్యూరీటీ కోసం ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే అగ్నివీరులకు నేను ప్రాధాన్యం ఇస్తాను'' అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి. యువకులు, దేశంలోని మిలటరీ సిబ్బందిని అగౌరవపరచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. యువత దేశానికి జీవితాంతం సేవలందించేందుకు రేయింబవళ్లు కష్టపడి శారీరక పరీక్షలు, రాత పరీక్షలు పాసవుతుంటారని, బీజేపీ కార్యాలయంలో గార్డులుగా చేరడానికి కాదని అన్నారు. యూనిఫాంలో ఉన్న వారిని చిన్నచూపు చూసేలా విజయవర్గీయ వ్యాఖ్యలు ఉన్నాయని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఓ ట్వీట్‌లో విమర్శించారు. అగ్నిపథ్ స్కీమ్‌పై ఉన్న అనుమానాలను బీజేపీ నేత కైలాస్ విజయ వర్గీయ నివృత్తి చేశారంటూ కాంగ్రెస్ చురకలు వేసింది. ఇలాంటి ఆలోచనాధోరణికి వ్యతిరేకంగానే తాము అగ్నిపథ్ నిరసనకారులకు సంఘీభావంగా సత్యాగ్రహ్‌ చేపట్టినట్టు తెలిపింది.

No comments:

Post a Comment