చీమలు తరచూ ఇంట్లో కనిపిస్తే ఏం జరుగుతుంది ?

Telugu Lo Computer
0


సాధారణంగా మన ఇళ్లల్లోకి క్రిమి కీటకాలు వస్తూనే ఉంటాయి. విషపూరితమైన కీటకాలు అయితే వెంటనే మనం వాటిని చంపి వేయడం వంటివి చేస్తూ ఉంటాం. విషపూరితం కానటువంటివి అయితే మనం నిర్మూలనకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇళ్లు శుభ్రంగా లేకపోవడం వల్లే కీటకాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. కొన్ని సార్లు మనం ఎంత శుభ్రం చేసినా కూడా మనకు తెలియకుండా ఏదో ఒక కీటకం ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అయితే కొన్ని రకాల కీటకాలు మన ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందని, కొన్ని రకాల కీటకాలు ఇంట్లోకి వస్తే చెడు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లోకి ఎటువంటి కీటకాలు వస్తే మంచి జరుగుతుంది. మన ఇంట్లోకి వచ్చే కీటకాలలో బొద్దింకలు ఒకటి. చాలా మంది వీటిని చూస్తేనే చిరాకు పడుతుంటారు. ఇవి రోగాలను కూడా వ్యాప్తి చేస్తాయి. ఇవి ఇంట్లోకి వస్తే మనం వాటిని తరిమివేయడమో, చంపేయడమో చేస్తూ ఉంటాం. ఇవి రోగకారకాలు మాత్రమే కాదు.. ఇంట్లోకి వస్తే అశుభమని చెబుతున్నారు. అలాగే కాళ్ల జెర్రి వచ్చినా కూడా ఏదో చెడు జరుగుతుందని అర్థం. ఇక ఇండ్లల్లో సాలె పురుగులు కూడా ఉంటాయి. ఎవరి ఇంట్లోనే అయితే ఎక్కువగా సాలెపురుగులు, సాలె గూళ్లు ఉంటాయో ఆ ఇంటికి దరిద్రం పట్టబోతోందనడానికి సంకేతమట. ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. సాలె గూళ్లు ఎక్కువగా ఉంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కువగా ఉంటుందట. కనుక ఇంట్లో ఉండే సాలె పురుగులను, సాలె గూళ్లను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. మన ఇండ్లల్లోకి పాములు కూడా వస్తూ ఉంటాయి. పామును చూస్తేనే మనం భయపడిపోతూ ఉంటాం. పాము గనక మన ఇంట్లోకి వస్తే ఏదో చెడు జరగబోతోందనడానికి సూచనట. పాము గనక ఇంట్లోకి వస్తే ఇంటి పెద్దకు ఏదో చెడు జరుగుతుందనేది ఒక నమ్మకం. అలాగే మన ఇంట్లోకి గనక చెద పురుగులు వస్తే మన ఇంట్లో ధనం నిలవదని నిపుణులు చెబుతున్నారు. చెద పురుగులు గనక ఇంట్లోకి వస్తే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలట. అదే విధంగా మన ఇంట్లో చీమలు దారులు కడుతూ ఉంటాయి. ఇవి రాగానే చాలా మంది మందు పెట్టి చంపేస్తూ ఉంటారు. కానీ చీమలు ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు భోగభాగ్యాలతో కళకళలాడుతుందని, త్వరలోనే ఇంట్లోకి దనం వస్తుందని, ఆ ఇంట్లోని వ్యక్తులు ఏ పని చేసినా కలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఇంట్లోకి గుడ్లగూబలు వచ్చినా కూడా మంచే జరుగుతుందట. అలాగే తేనెటీగలు వచ్చినా అవి తేనెతెట్టెను పెట్టినా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)