వికటించిన సర్జరీ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 June 2022

వికటించిన సర్జరీ !


బెంగళూరుకు చెందిన కన్నడ నటి స్వాతి సతీష్ ఇటీవల ఒక ప్రయివేటు ఆస్పత్రిని రూట్ కెనాల్ థెరపీ కోసం ఆశ్రయించగా అది విఫలమవడంతో కొంతకాలంగా తీవ్రమైన నొప్పి ముఖం వాపుతో బాగా బాధపడుతోంది. ఆ ముఖం వాపు రెండు మూడు రోజుల్లో నయమవుతుందని ఆ దంత వైద్యుడు హామీ ఇచ్చారు. అయితే మూడు వారాల తర్వాత కూడా ముఖంపై వాపు తగ్గకపోగా, తీవ్రమైన నొప్పితో ఆమె బాధపడుతోంది. ఉబ్బిన ముఖం కారణంగా ఆమె దాదాపుగా గుర్తించలేనంతగా మారింది. ఆ ముఖంతో తన ఇంటి నుండి బయటకు వెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఇక ఆ చికిత్స గురించి డాక్టర్ అసంపూర్ణ సమాచారం ఇచ్చారని, అలాగే తప్పుడు మందులు అందించారని సదరు నటి ఆరోపించారు. ఇప్పుడు మరో ఆసుపత్రిలో దీనికోసం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ప్రక్రియలో ఆమెకు అనస్థీషియాకు బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు ఆరోపణలు అనేవి వచ్చాయి. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసింది. ప్రస్తుతం సదరు నటి తన ఇంట్లోనే కోలుకుంటున్నారు.

No comments:

Post a Comment