గుజరాత్‌లో పింక్ లేక్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 11 June 2022

గుజరాత్‌లో పింక్ లేక్ !


గుజరాత్‌లోని బనాస్ కాంతా జిల్లాలో ఉన్న సుగమ్ గ్రామంలోని చెరువు పింక్ కలర్‌లోకి మారిపోయింది. కొరేటి అనే పేరు గల ఈ చెరువు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉంది. ఉన్నట్లుండి ఈ చెరువులోని నీళ్లు గులాబి రంగులోకి మారిపోవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఇది వర్షపు నీటి ఆధారిత చెరువు. వర్షాకాలంలో చెరువు నిండుతుంది. ఆ తర్వాత ఈ నీటినే గ్రామస్తులు తమ అవసరాలకు వాడుకుంటారు. ప్రస్తుతం నీళ్లు గులాబి రంగులోకి మారడంతో ఈ వింతను చూసేందుకు స్థానికులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అధికారులు ఇక్కడికి చేరుకుని చెరువు నీటిని పరిశీలించారు. నీటి శాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపారు. నీటిని పరీక్ష కోసం పంపామని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని తహసీల్దార్ తెలిపారు. ఈ నీటి గురించిన పూర్తి సమాచారం తెలిసేవరకు ఎవరూ నీటిని, ఎలాంటి అవసరాలకు వినియోగించవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

No comments:

Post a Comment