మేం సెలబ్రిటీలం కాబట్టే ......! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 23 June 2022

మేం సెలబ్రిటీలం కాబట్టే ......!


'మా' మాజీ అధ్యక్షుడు, సీనియర్ సినీ నటుడు నరేష్ నాలుగో పెళ్లి వార్త సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. సీనియర్ నటి పవిత్రా లోకేష్‌ని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడనే నెట్టింట హల్చల్ చేస్తుంది. చాలా సినిమాల్లో ఈ ఇద్దరూ జంటగా నటించడంతో.. ఇక రియల్ లైఫ్‌లో కూడా ఒక్కటి అవుతున్నారంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. తాజాగా తనకు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడంతో సినీ నటుడు నరేష్ స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అంటుంటారు.. ఎందుకంటే వాళ్లు మాత్రమే కనిపిస్తారు. ఏం మిగిలిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకోలేదా అంటూ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీలు కనుక వారికి సంబంధించిన విషయాలన్నీ బయటకు తెలుస్తాయి. పెళ్లిళ్లు అనేది ఆట కాదు.. పెళ్లి అంటే లైఫ్. ఆ లైఫ్‌లో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప వేరే పెళ్లి నిర్ణయానికి రారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వివాహ వ్యవస్థ తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. పెళ్లయిన నెల రోజులకే భార్య భర్తలు విడిపోవాలని అనుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు ఒక్క ఫ్యామిలీకోర్టు మాత్రమే ఉండేదన్నారు. ఇప్పుడు 8 ఫ్యామిలీ కోర్టులు వచ్చాయన్నారు. ఆర్టిస్ట్ అనేవాడికి స్థిరత్వం ఉండదు. సెక్యురిటీ లేదు.. టైమింగ్ లేదు.. నేను నెలలో 28 రోజులు షూటింగ్‌లోనే ఉండేవాడిని. అలాంటి సమయంలో నా వృత్తిపరమైన జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్లే నాతో ఉంటారని అన్నారు.  తన మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ తనని ఎవరు అర్థం చేసుకోకపోవడం వల్లే విడాకులు ఇచ్చినట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు. సినిమానే తన మొదటి భార్య, సినిమా కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని ఈ సందర్భంగా నరేష్ తన మూడు పెళ్లిళ్ల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉండటం వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేక పోతున్నారని తెలిపారు. అందుకే తాను ముగ్గురు భార్యలకు కూడా విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని నరేష్ వ్యాఖ్యలు చేశారు. నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనతో అడ్జస్ట్ అయిన వాళ్లు మాత్రమే తనతో ఉంటారని మిగిలిన వాళ్లు వెళ్లిపోతారంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి నాలుగో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అన్న రీతిలో నరేష్ సమాధానం ఇచ్చారని జనం చర్చించుకుంటున్నారు.

No comments:

Post a Comment