దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్

Telugu Lo Computer
0


17 బ్యాంకులను నిండా ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు ఏకంగా..రూ.34,615 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌, ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. సీబీఐ దర్యాప్తు చేపట్టిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని  అధికారులు పేర్కొన్నారు. ఈ బ్యాంకు మోసాల గురించి ఇన్నాళ్లు ఎదురు చూసిన సీబీఐ ఇప్పుడు పక్కా ఆధారాలతో రంగలోకి దిగింది. మాజీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌, ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. జూన్ 20న కేసు నమోదయిన క్రమంలో బుధవారం ముంబయిలో ఒకేసారి 12 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న వారిలో అమిలిస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ షెట్టితో పాటు..మరో ఎనిమిది మంది బిల్డర్లు కూడా ఉన్నారు. 2010-18 మధ్య యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకుల కన్సార్షియం రూ.42,871 కోట్ల విలువైన రుణాలను తీసుకుని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. వీటికి సంబంధించి యూనియన్‌ బ్యాంక్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలోనే సీబీఐ విచారణ చేపట్టింది. కపిల్‌, ధీరజ్‌లు నిజాల్ని కప్పిపుచ్చుతూ.. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, 2019 మే నుంచి రుణ చెల్లింపులను ఎగవేస్తూ రూ.34,614 కోట్ల మేర ప్రజా ధనాన్ని మోసం చేశారని, కుట్రపూరితంగా ప్రవర్తించారని బ్యాంకు ఆరోపించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖాతా పుస్తకాలపై ఆడిట్‌లోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని..నిధులను మళ్లించారని..పుస్తకాల్లో గణాంకాలను మార్చారని, తద్వారా కపిల్‌, ధీరజ్‌లు సొంత ఆస్తులు పెంచుకున్నారని.. ఇదంతా ప్రజా ధనంతో చేశారని ఆరోపణలు చేసింది. వీరిద్దరూ అంతక్రితం ఉన్న మోసపూరిత కేసుల్లో జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)