కళా ప్రేమికులను ఆకట్టుకుంటున్న ప్రగతి మైదాన్ టన్నెల్ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్. 1.3 కిలోమీటర్ల పొడవుంటుంది. వారం రోజుల క్రితమే ప్రారంభమైన ఈ టన్నెల్. దీని లోపల గోడలపై అందమైన చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆకట్టుకునే లైటింగ్‌తో రంగురంగుల చిత్రాలు కనువిందు చేస్తాయి. కానీ, ఈ టన్నెల్‌లో నిత్యం వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అక్కడి కళాచిత్రాలను చూసిన మోదీ, వాటిని చూసి ఆశ్చర్యపోయారు. వాటిని అలా వదిలేయకుండా, కళా ప్రేమికులు చూసేందుకు అందుబాటులోకి తేవాలనుకున్నారు. దీనికోసం అధికారులకు సూచనలు చేశారు. అంతే ఇకపై ప్రతి ఆదివారం ఈ టన్నెల్ ఆర్ట్ లవర్స్ చూసేందుకు అందుబాటులోకి రానుంది. అంటే ప్రధాని సలహా మేరకు ఈ టన్నెల్ రోడ్డును ప్రతి ఆదివారం మూసేస్తారు. ఈ టన్నెల్ ద్వారా వాహనాలను అనుమతించరు. కేవలం అక్కడి ఆర్ట్‌ను చూసి ఆనందించేందుకు వచ్చే వాళ్లను మాత్రమే టన్నెల్‌లోకి అనుమతిస్తారు. అది కూడా కాలి నడకన మాత్రమే వెళ్లొచ్చు. టన్నెల్ అంతా తిరుగుతూ అక్కడి గోడలపై ఉన్న చిత్రాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ ఆ చిత్రాలు అంత ప్రత్యేకంగా ఎందుకున్నాయనుకుంటున్నారా? 1.3 కిలోమీటర్ల పొడవైన గోడపై అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, ఆరు రుతువులను చూపే చిత్రాలు, రాశులు, వివిధ జంతుజాలం, భారతీయ సంస్కృతి, పండుగలు వంటివి ఆ చిత్రాల్లో కనిపిస్తాయి. ఇటీవల టన్నెల్ ప్రారంభం సందర్భంగా వాటిని కొద్దిసేపు చూసినప్పుడు కలిగిన ఆనందం అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఈ సూచన చేసినట్లు మోదీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)