యవ్వనంగా కనిపించాలంటే..? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 June 2022

యవ్వనంగా కనిపించాలంటే..?


పురుషులు ఆరోగ్యం, అందం గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల వారి చర్మం తొందరగా ముడతలు పడుతోంది. ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత పురుషుల చర్మం అంద విహీనంగా తయారవుతంది. కొన్నిచిట్కాలు ద్వారా అందాన్ని పెంపొందించుకోవచ్చు. చర్మ సంరక్షణలో భాగంగా ఉదయం లేచిన వెంటనే మొదట ఫేస్‌వాష్ చేయాలి. చాలా సార్లు పురుషులు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోరు. దీని వల్ల చర్మం జిడ్డుగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో జిడ్డు చర్మాన్ని శుభ్రం చేయడానికి క్లెన్సర్ ఉపయోగించవచ్చు. 35 ఏళ్ల తర్వాత చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోతే చర్మం వదులుగా మారుతుంది. ఈ పరిస్థితిలో చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ సీరమ్ వాడాలి. ముఖం కడుక్కుని విటమిన్ సి ఉన్న సీరమ్‌ను అప్లై చేసిన తర్వాత తప్పనిసరిగా మర్దన చేయాలి. చర్మాన్ని తేమగా మార్చుకోవాలి. ఇది మీ చర్మం కాంతివంతంగా తయారుకావడానికి సహాయపడుతుంది. దీంతో పాటు మీ చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కొన్నిసార్లు చర్మం చెడిపోవడానికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలి కారణం అవుతుంది. 35 సంవత్సరాల తర్వాత పురుషులు వారి జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం మీరు పుష్కలంగా నీరు తాగాలి. ఇది చర్మాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

No comments:

Post a Comment