అవసరమైతే రాజీనామాకు సిద్దం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 22 June 2022

అవసరమైతే రాజీనామాకు సిద్దం !


మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి ఆయన బుధవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడారు. ఎక్కడో ఉన్న ఎమ్మెల్యేలు తన ముందుకొచ్చి, రాజీనామా చేయాలి అని ఎందుకు ప్రశ్నించరు అని ఉద్ధవ్ నిలదీశారు. 'నా రాజీనామాను సిద్ధంగా ఉంచుతున్నాను. కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, రాజీనామా తీసుకుని గవర్నర్‌కు ఇవ్వొచ్చు. వాళ్లు నా ఎదురుగా వచ్చి రాజీనామా చేయాలి అని ఎందుకు అడగరు? నేను సీఎంగా ఉండకూడదని కాంగ్రెస్ లేదా ఎన్సీపీ అడగటం లేదు. సోనియా గాంధీ, శరద్ పవార్ నా మీద నమ్మకం ఉంచారు. నేను బాలా సాహెబ్ (బాల్ థాక్రే) కొడుకును. ఆయన నాకు ఇచ్చిన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నాను. అదీ నాకు ఎలాంటి అనుభవం లేకుండానే. అయినా, ఇదేం ప్రజాస్వామ్యం. గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా కూడా ఎమ్మెల్యేలను ఇలాగే బంధించారు. 2014లో మేం ఒంటరిగానే పోరాడాం. మేం హిందూత్వను వదిలిపెట్టేది లేదు. అదే మాకు బాలా సాహెబ్ నేర్పిన మంత్రం. శివ సైనికులకు చెప్పేదొకటే నేను పార్టీని, రాష్ట్రాని నడిపించడానికి అర్హుడిని కాదనుకుంటే ఆ మాట నా ఎదురుగా వచ్చి చెప్పండి. అలా చేస్తే పార్టీ నాయకత్వాన్ని వీడేందుకు సిద్ధం. కానీ, ముందు నాతో మాట్లాడండి. నేను అవసరం లేదని చెబితే వెంటనే బాధ్యతల్ని వదిలేస్తాను. ఎంత మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారన్నది కూడా చూడను. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే చెప్పినా నేను పదవిని వదిలేస్తాను. నేనేమీ డ్రామాలు ఆడటం లేదు'' అని ఉద్ధవ్ థాక్రే తన ప్రసంగంలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment