ఆరోగ్య భారత్ కోసం పాటు పడదాం !

Telugu Lo Computer
0


నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ 21వ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ లో  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ  పాల్గొని మాట్లాడుతూ  దేశాన్నిఆరోగ్యభారత్ గా తీర్చిదిద్దడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహర్నిశలూ శ్రమిస్తున్నారని దానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జాతి కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు.ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 5లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవల కోసం ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. ప్రధాన మంత్రి జనౌషధి పరియోజన పధకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అన్ని వర్గాలకు ప్రత్యేకించి పేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్యాన్ని తీసుకు రావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకూ ఆరోగ్యం కోసం 1.18లక్షల హెల్త్అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రధాన మంత్రి మోదీ ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)