సోము వీర్రాజు ను అడ్డుకున్న పోలీసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి పోలీసులు షాకిచ్చారు. అమలాపురం అల్లర్లు నేపధ్యంలో ఆలమూరు వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డుకున్నారు పోలీసులు. అమలాపురం వెళ్తున్నారని సోము వీర్రాజును అడ్డుకున్నారు పోలీసులు. రావులపాలెం పోలీసు స్టేషన్ వద్దకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సోమువీర్రాజు వాహనం కదలనీయకుండా రోడ్డుకు అడ్డంగా మరో వాహనం అడ్డం పెట్టారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వాహనం ఎందుకు ఆపుతున్నారని అడిగితే కారణం చెప్పలేక పోతున్నారు పోలీసులు. ఎస్పీ ఆదేశాలతో ఆపామంటున్నారు పోలీసులు. అమలాపురం అల్లర్లలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు తాను వెళుతున్నానని, తనను అడ్డుకోవడమేమిటని వీర్రాజు ప్రశ్నించారు. అల్లర్ల నేపథ్యంలో ఇంకా పోలీసు ఆంక్షలు కొనసాగుతున్న అమలాపురంలో ప్రముఖుల పర్యటనకు అనుమతించలేమని పోలీసులు ఆయనకు తేల్చిచెప్పారు. కనీసం తమ పార్టీ నేతలనైనా కలిసేందుకు అనుమతిస్తారా? అని వీర్రాజు అడగగా… బయటి వ్యక్తులను అమలాపురంలోకి అనుమతించబోమంటూ పోలీసులు తెగేసి చెప్పడంతో సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రావులపాలెంలోని తమ పార్టీ నేత తల్లి ఇటీవలే మరణించారని, కనీసం ఆ నేత కుటుంబం పరామర్శకు అయినా అనుమతిస్తారా? అని వీర్రాజు అడగగా… రావులపాలెం వరకు అయితే అనుమతిస్తామని పోలీసులు స్సష్టం చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. సోము వీర్రాజు కారు రావులపాలెం వైపు వెళ్ళిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)