లైంగిక దాడుల సంస్కృతిని ప్రేరేపించే పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనలను తొలగించాలి

Telugu Lo Computer
0


లైంగిక దాడుల సంస్కృతిని ప్రేరేపించే పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనను తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్, యూట్యూబ్‌ను కోరింది. ఈ ప్రకటన ప్రసారమయ్యే టీవీ ఛానెల్ నుంచి కూడా సదరు యాడ్‌ను తొలగించారు. ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు పెర్‌ఫ్యూం బ్రాండ్ ప్రకటనపై లేఖ రాయడంతో పాటు మీడియా నుంచి ఈ ప్రకటనను తొలగించాలని, బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు. జూన్ 9లోగా నివేదికను సమర్పించాలని పోలీసులను కోరారు. లైంగిక దాడి సంస్కృతిని ప్రోత్సహించేలా ఉన్న ఈ తరహా ప్రకటనలపై గట్టి నిఘా ఉండేలా చర్యలు చేపట్టాలని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ కేంద్రాన్ని కోరారు. ఈ బ్రాండ్‌పై భారీ పెనాల్టీలు విధించి ఇతర కంపెనీలు ఇలాంటి ప్రకటనలకు సాహసించకుండా ఉండేలా నిరోధించాలని అన్నారు. మన టీవీ స్క్రీన్‌లపై ఇలాంటి జుగుప్సాకర, నీచమైన ప్రకటనలు ప్రసారం కావడంతో తాను దిగ్ర్భాంతికి గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)