డేటింగ్ యాప్ ప్రియురాలికి రూ. 5,70 కోట్లు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 June 2022

డేటింగ్ యాప్ ప్రియురాలికి రూ. 5,70 కోట్లు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ !


బెంగళూరు నగరంలోని హనుమంతనగర్ లో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గా హరిశంకర్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. కేరళకు చెందిన హరిశంకర్ వివాహం చేసుకుని అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. కాన్ఫు కోసం హరిశంకర్ భార్య కేరళ వెళ్లింది. ఐటీ హబ్ లో ఒంటరిగా ఉంటున్న హరిశంకర్ డేటింగ్ యాప్ లో పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా అనే మహిళతో బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ టచ్ లో ఉన్నాడు. కొంతకాలం తరువాత హరిశంకర్, అనితా ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని రోజూ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకొనేవారు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా మాటలకు బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ పడిపోయాడు. ఆమె ఏం చెబితే అది చెయ్యడం మొదలు పెట్టాడు. అనితా చెప్పిన బ్యాంక్ అకౌంట్స్ కు ఇండియన్ బ్యాంకు మేనేజర్ హరిశంకర్ బ్యాంకుకు చెందిన రూ. 5.70 కోట్లు, అతని సొంత డబ్బులు రూ. 12 లక్షలు బదిలి చేశాడు. మే 13వ తేదీ నుంచి మే 19వ తేదీ మధ్యలోనే అనితా చెప్పిన బ్యాంక్ అకౌంట్స్ కు హరిశంకర్ డబ్బులు ట్రాన్సఫర్ చేశాడు. వారం రోజులలో ఇంత డబ్బు గోల్ మాల్ కావడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. హనుమంతనగర్ లోని ఇండిబ్యాంక్ లో ఆడిటింగ్ జరిగింది. బ్యాంకుకు చెందిన రూ. 5.70 కోట్లు గోల్ మాల్ అయ్యిందని ఆడిటింగ్ లో వెలుగు చూసింది. ఇండియన్ బ్యాంకు సీనియర్ అధికారి మూర్తి హనుమంతనగర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మేనేజర్ హరిశంకర్ ను ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానంతో బ్యాంకు అధికారులు, పోలీసులు బిత్తరపోయారు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా అనే మహిళ చెప్పిన పశ్చిమ బెంగాల్ లోని 28 బ్యాంక్ అకౌంట్స్. కర్ణాటకలోని రెండు బ్యాంక్ అకౌంట్స్ కు ఇండియన్ బ్యాంకుకు చెందిన రూ. 5.70 కోట్లు, తన సొంత డబ్బులు రూ. 12 లక్షలు బదిలి చేశానని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ అంగీకరించడంతో బ్యాంకు యాజమాన్యం, పోలీసులు షాక్ అయ్యారు. అయితే ఇంత వరకు  అనితా అనే మహిళ ముఖం ఒక్కసారి కూడా తాను చూడలేదని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ హరిశంర్ పోలీసులకు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ తో పాటు అదే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న కౌసల్యా, క్లర్క్ మునిరాజు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ ను అరెస్టు చేసిన హనుమంతనగర పోలీసులు డేటింగ్ యాప్ లోని అతని ప్రియురాలు అనితా కోసం గాలిస్తున్నారు.

No comments:

Post a Comment