పురాతన ఆలయంలో తవ్వకాల్లో బయటపడిన 35 రహస్య సొరంగాలు

Telugu Lo Computer
0


సౌత్ అమెరికాలోని పెరు దేశంలో ఉత్తర-మధ్య ఆండీస్‌ ప్రాంతంలో ఉన్న ‘చవిన్ డి హుయంటార్' అనే 3 వేల ఏళ్ల నాటి పురాతన దేవాలయంలో కొన్ని సంవత్సరాల నుంచి తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాఖ అధికారులకు 35 రహస్య సొరంగాలు బయటపడ్డాయి. అవన్నీ కూడా క్రీస్తు పూర్వానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉండగా, చాలా ఏళ్ల పాటు తవ్వకాలు జరిపిన అనంతరం ఈ ఏడాది మే నెలలో 35 సొరంగాలను పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. క్రీస్తుపూర్వం 200-1200 మధ్య అండీస్ పర్వత ప్రాంతంలో ఇంటర్‌కనెక్టడ్ సొరంగాలు నిర్మించబడ్డాయి. ఈ సొరంగాలు పూర్తిగా భిన్నమైనవని, ఇవి కూడా విభిన్నంగా నిర్మించబడ్డాయని పురావస్తు శాఖ అధికారి రిక్ వెల్లడించాడు. ఈ ఆలయం 1985వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. 1997వ సంవత్సరంలో పెరువియన్ సాయుధ దళాలు బందీలుగా ఉన్న 72 మందిని రక్షించేందుకు సైనిక ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో తుపాక్ అమరు రెవల్యూషనరీ మూవ్‌మెంట్ తిరుగుబాటు బృందంపై యుద్దానికి సిద్దమయ్యారు. అప్పుడే సైనికులు పలు సొరంగాలు నిర్మించారు. వాటిల్లో ఇవి కూడా ఒక భాగం అయి ఉంటాయని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)