బీహార్‌లో రైల్వేకు 200 కోట్ల నష్టం

Telugu Lo Computer
0


అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ బీహార్‌లో భారీ స్థాయిలో నిరసనలు హోరెత్తిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు రైల్వే ఆస్తుల్ని యువకులు తగలబెట్టారు. ఆ నష్టం సుమారు 200 కోట్లు ఉంటుందని దానాపూర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం ప్రభాత్ కుమార్ తెలిపారు. ఆర్మీ అభ్యర్థులు జరిపిన దాడిలో 50 బోగీలు, అయిదు ఇంజిన్‌లు పూర్తిగా దగ్ధం అయినట్లు ఆయన చెప్పారు. ఇక ఆ బోగీలు, ఇంజిన్‌లు సర్వీస్‌కు పనికి రావన్నారు. ప్లాట్‌ఫామ్‌లు, కంప్యూటర్లు, సాంకేతిక వస్తువులు ఎన్నో డ్యామేజ్ అయినట్లు ప్రభాత్ తెలిపారు. అనేక రూట్లలో రైళ్లను రద్దు చేసినట్లు డీఆర్ఎం చెప్పారు. అగ్నిపథ్ స్కీమ్‌పై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇవాళ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశం అవుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)