ఒకే కుటుంబంలో 150 మంది డాక్టర్లు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 June 2022

ఒకే కుటుంబంలో 150 మంది డాక్టర్లు !


ఢిల్లీలోని సబర్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దివంగత డాక్టర్ లాలా జీవన్మోల్ 1920లో 'లాలా జీవన్మోల్' పేరుతో పాకిస్తాన్లోని జలాల్‌పూర్ నగరంలో ఆసుపత్రిని నిర్మించారు. ఆరోజు నుంచి నేటీవరకు ఆ ఆసుపత్రిలో లాలా జీవన్మోల్ కుటుంబ సభ్యులే డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 1920 నుంచి నేటి వరకు ఒకే కుటుంబం నుంచి 150 మంది వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు అయ్యారు. ఇంతమంది డాక్టర్లు అవ్వడానికి ప్రధాన కారణం.. 'విద్య, వైద్య సేవల నాణ్యతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది' అని గాంధీజీ గారు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని, దేశ సేవ కోసం వైద్య విద్యను ఎంచుకున్నారట. లాలా జీవన్మోల్ తన నలుగురి పిల్లల్ని వైద్యులను చేయాలని నిర్ణయించుకున్నారు. స్వాతంత్రం తరువాత.. లాలా జీవన్మోల్ కుటుంబం ఢిల్లీకి మారింది. అయినప్పటి ఆ సంప్రదాయం కొనసాగింది. ఫ్యామిలీలో అందరినీ డాక్టర్‌గా మార్చే వారసత్వం ఢిల్లీకి వచ్చేకే మొదలైంది. ఇది గత 102 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే, ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరూ డాక్టర్ చదవడం అంటే అంత తేలికైన పని కాదు. ఎందుకంటే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా వ్యక్తుల ఆలోచనలు, అభిరుచుల్లో కూడా మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే లాలా జీవన్మోల్ కుటుంబంలోని ఓ వ్యక్తి మేనేజ్‌మెంట్ డిగ్రీ చదవడం ప్రారంభించాడట. అయితే, అతడి అమ్మమ్మ తన మనవడు డాక్టర్ కాకుండా వేరే చదువు చదవడంపై తీవ్రంగా మండిపడిందట. దాంతో అతను తన మేనేజ్‌మెంట్ చదువుకు స్వస్తి పలికి మళ్లీ వైద్య వృత్తిని అభ్యసించి, డాక్టర్ అయ్యాడట. అయితే, ఆసుపత్రిని పాకిస్తాన్ నుంచి ఢిల్లీకి మార్చిన రోజు నుంచి జీవన్మోల్ హాస్పిటల్‌లో ఇప్పటి వరకూ ఏ రోగి డబ్బులు లేవనే కారణంతో వైద్యం తీసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్లిన రోజే లేదట. ఆ ఆస్పత్రిలో పేదవారికి సరైన చికిత్స అందించేవరకు డాక్టర్లు పేషెంట్‌ను బయటికి పంపించారట. గత రెండ్లక్రితం కరోనా సృష్టించిన కల్లోలంలో జీవన్మోల్ ఫ్యామిలీలో ఇద్దరు సభ్యులు కరోనాతో మరణించారు. ప్రతి ఏడాది జూలై 1న వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటాం. రేపు జరుపుకోబోయే డాక్టర్ల దినోత్సవంగా సందర్భంగా లాలా జీవన్మోల్ సక్సెస్ స్టోరీని ఓ ఆంగ్ల పత్రిక వ్యాసంగా ప్రచురించటంతో ఇలాంటి డాక్టర్లు ఇంకా ఉన్నారు కాబట్టే భారతదేశం అభివృద్ది బాటలో నడుస్తుందని పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

No comments:

Post a Comment