గర్ల్​ ఫ్రెండ్​ను పరిచయం చేసిన హృతిక్​ రోషన్

Telugu Lo Computer
0


ముంబయిలో జరిగిన కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకల్లో హృతిక్ రోషన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచాడు  పుకార్లను నిజం చేస్తూ తొలిసారిగా తన గర్ల్​ఫ్రెండ్​ సబా ఆజాద్​తో కలిసి పార్టీకి వచ్చాడు. అనంతరం ఇద్దరూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ఈ పార్టీకి వచ్చిన వారందరికీ సబా ఆజాద్​​ను పరిచయం చేశాడు హృతిక్​. పార్టీలో విరిద్దరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫిబ్రవరిలో ఓ విందుకు హాజరైనప్పటి నుంచి హృతిక్, సబా రిలేషన్​లో ఉన్నారని రూమర్లు మొదలయ్యాయి. ఆ తర్వాత హృతిక్ ఫ్యామిలీ గెట్​ టుగెదర్​కు కూడా సబా వెళ్లింది. అయితే ఇప్పటి వరకు ఇద్దరూ తమ రిలేషన్​షిప్​పై నోరువిప్పలేదు. కానీ పార్టీలకు కలిసి హాజరవ్వడం చూస్తుంటే ఇది నిజమనే అర్థమవుతోంది. మరోవైపు కరణ్​ జోహార్ బర్త్​డే పార్టీకి హృతిక్ మాజీ భార్య సుసేన్ ఖాన్ కూడా హాజరైంది. ఆమె రూమర్డ్​ బాయ్ ​ఫ్రెండ్​ అర్స్​లాన్​ గోనితో కలిసి పార్టీకి వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)