అమలులోకి రానున్న సీబీడీటీ కొత్త రూల్స్

Telugu Lo Computer
0


బ్యాంకు ఖాతాలో నిర్దిష్ట పరిమితికి మించి డబ్బు జమ చేయడం లేదా విత్‌డ్రా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. మే 26 నుండి అమలులోకి వస్తుంది. దీంతోపాటు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరెంట్ ఖాతా తెరవడానికి ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ రెండింటికి ప్రభుత్వం ఆధార్ లేదా పాన్‌ని తప్పనిసరి చేసింది. సేవింగ్స్ అకౌంట్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు, క్యాష్ డిపాజిట్ ఛార్జీలు" ఇకపై రూ. 20 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి ఈ నియమం వర్తిస్తుంది. మే 10న నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా సీబీడీటీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. అంతేకాదు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో కరెంట్ ఖాతా లేదా నగదు క్రెడిట్ ఖాతాను తెరవడం కూడా అవసరం. దీంతో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి పాన్ సమాచారం అందించాల్సిన అవసరం ఉండి అతని వద్ద పాన్ లేకపోతే.. సంబంధిత వ్యక్తి ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపును ఇవ్వడం ద్వారా పని చేయవచ్చు. లావాదేవీ సమయంలో పాన్ నంబర్ ఇస్తే, పన్ను అధికారులకు లావాదేవీలను ట్రాక్ చేయడం సులభం అవుతుందని నంగియా అండ్ కోకు చెందిన శైలేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్త రూల్స్ ఇన్‌కమ్ ట్యాక్స్(15వ సవరణ) రూల్స్, 2022. ఈ చర్య ఆర్థిక లావాదేవీలలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని.. దీని కారణంగా బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా సహకార సంస్థలు మరిన్ని లావాదేవీలను నివేదించడం తప్పనిసరి అని AKM గ్లోబల్ సందీప్ సెహగల్ ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఆర్‌బీఐ నియమనిబంధనలు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ... నగదు లావాదేవీలపై ప్రభుత్వం చెక్ పెట్టేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. ఇది అనుమానాస్పద డిపాజిట్లు, ఉపసంహరణలకు సంబంధించిన ప్రక్రియలో కఠినతను తీసుకువస్తుందని అన్నారు. ఇప్పటివరకు ఆదాయపు పన్ను సంబంధిత పనుల కోసం ఆధార్ లేదా పాన్‌ను ఉపయోగించారు. ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ప్రతి పనిలో పాన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి చేసింది. అదే సమయంలో ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో లావాదేవీ సమయంలో పాన్ కలిగి ఉండకపోతే.. అతను ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)