బెంగళూరులో గర్ల్స్ స్కూల్ విద్యార్దునులు ఫైట్ !

Telugu Lo Computer
0


బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో చదువుతున్న కొందరు విద్యార్థులు యూనీఫామ్ లోనే స్కూల్ క్యాంపస్ బయటకు వచ్చి ఒకరి జట్లు ఒకరు పట్టుకుని ముష్టి యుద్దం చేసుకుంటున్న సమయంలో అటువైపు వెలుతున్న కొందరు వారి మొబైల్ ఫోన్లలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ గొడవలో బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లో చదువుతున్న కొందరు అమ్మాయిలకు తీవ్రగాయాలైనాయని తెలిసింది. కొందరు అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆ సమయంలో అక్కడ ఉన్నారని సమాచారం. ఓ విద్యార్థి సాటి విద్యార్థి తల్లిని మెట్ల మీద నుంచి ఆమె జట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమ్మాయిల గొడవకు సంబంధించి బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చెయ్యలేదని కన్నడ మీడియా అంటోంది. మొత్తం మీద బెంగళూరులో బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ లోని కొందరు అమ్మాయిలు చేసిన రచ్చ ఇప్పుడు ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)