ప్రభుత్వానికి ఇచ్చిన భూమి తిరిగి తీసుకోలేరు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం దేవనూరులో 2.57 ఎకరాల భూమిని బలహీన వర్గాలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు దాని యజమాని సుంకిరెడ్డి నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఆ భూమిని ఖాళీగా ఉంచిన ప్రభుత్వం ఎవరికీ దాన్ని కేటాయించలేదు. దీంతో 2015లో సుంకిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తన భూమి తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి పరిహారం ఇచ్చిన తర్వాత దాన్ని వినియోగించటం లేదన్న కారణంగా పిటిషనర్ కు భూమిని తిరిగి ఇవ్వమని ఆదేశించలేమని స్పష్టం చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)