హైదరాబాద్ నుంచి జగన్నాథ రథయాత్ర టూర్

Telugu Lo Computer
0


ఒడిషాలోని పూరీలో ప్రతిష్టాత్మకంగా జరగబోయే జగన్నాథ రథయాత్రకు వెళ్లాలనుకునే హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సీటీసీ టూరిజం  హైదరాబాద్ నుంచి జగన్నాథ రథయాత్ర టూర్ ప్యాకేజీ ప్రకటించింది. జూలైలో పూరీ జగన్నాథ రథయాత్ర జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఐఆర్‌సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో పూరీ జగన్నాథ రథయాత్రతో పాటు కోణార్క్, భువనేశ్వర్ కూడా కవర్ అవుతాయి. ఈ టూర్ 2022 జూన్ 30న ప్రారంభమై జూలై 1న ముగుస్తుంది. ఫ్లైట్‌లో టూరిస్టుల్ని తీసుకెళ్లి జగన్నాథ రథయాత్రతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం జగన్నాథ రథయాత్ర మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు ఉదయం 6.35 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 8.15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటారు. పర్యాటకుల్ని పికప్ చేసుకొని పూరీ తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత కోణార్క్ బయల్దేరాలి. చంద్రభాగ బీచ్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత తిరిగి పూరీ బయల్దేరాలి. రాత్రికి పూరీలో బస చేయాలి.రెండో రోజంతా పూరీ జగన్నాథ రథయాత్ర చూడొచ్చు. సీటింగ్ ఏర్పాట్లతో పాటు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి. రాత్రికి పూరీలోనే బస చేయాలి. మూడో రోజు భువనేశ్వర్ బయల్దేరాలి. దారిలో ధౌలి స్థూపం, లింగరాజ్ ఆలయం సందర్శించవచ్చు. సాయంత్రం 6.05 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరితే రాత్రి 7.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ జగన్నాథ రథయాత్ర టూర్ ప్యాకేజీ ధర చూస్తే కంఫర్ట్, డీలక్స్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.18,115 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.20,525. ఇక సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,555 చెల్లించాలి. ఇక డీలక్స్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.20,035 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.22,505. ఇక సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,790 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, రెండు రాత్రులు పూరీలో బస, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. సైట్‌సీయింగ్ ప్లేసెస్, ఆలయాల్లో ఎంట్రెన్స్ టికెట్స్, హైదరాబాద్‌లో లోకల్ పికప్ అండ్ డ్రాప్, ఫ్లైట్‌లో మీల్స్ లాంటివి కవర్ కావు.


Post a Comment

0Comments

Post a Comment (0)