నాగ్‌పూర్‌ జైలు మరుగుదొడ్లో సీసీ కెమెరాలు ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 15 May 2022

నాగ్‌పూర్‌ జైలు మరుగుదొడ్లో సీసీ కెమెరాలు ?


మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్‌పూర్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.ఎన్‌.సాయిబాబా నిరవధిక నిరాహారదీక్ష చేస్తానంటూ జైలు అధికారులను ఇటీవల హెచ్చరించిన విషయం బయటికి వెల్లడైంది. జైలులో తాను ఉంటున్న గదిలోని మరుగుదొడ్డి, స్నానాల ప్రాంతంలో పెట్టిన సీసీ కెమెరా ఫుటేజి తొలగించకపోతే దీక్షకు దిగడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై సాయిబాబా భార్య వసంతకుమారి, సోదరుడు జి.రామదేవుడు మహారాష్ట్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తూ మే 14న ఓ లేఖ రాశారు. జైలుశిక్ష అనుభవిస్తున్న సాయిబాబా గోప్యతకు, గౌరవానికి భంగం కలగకుండా చూడాలని అందులో కోరారు. నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ అనూప్‌ కుమ్రే ఈ ఆరోపణలకు ఆదివారం వివరణ ఇచ్చారు. అండాకారంలో ఉన్న జైలు గదుల్లోని ఖైదీలు అందరిపై నిఘా కోసం ఆ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


No comments:

Post a Comment