తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు !

Telugu Lo Computer
0


సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ని లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. లీటర్ పెట్రోల్ పై  రూ.9.50, లీటర్ డీజిల్‌పై 7 రూపాయలు తగ్గనుంది. వంట గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయల సబ్సిడీని (12 సిలిండర్ల వరకూ) ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే.. ప్రధాని ఉజ్వల్ యోజన గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి ఈ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులకు సంబంధించిన ముడి పదార్థాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్టీల్‌కు సంబంధించిన కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు నిర్మలా వెల్లడించారు. కొన్ని స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని ఎత్తివేస్తున్నట్లు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సిమెంట్‌ లభ్యతను పెంచి ధర తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)