జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ కు దీపిందర్ గోయల్ భారీ విరాళం

Telugu Lo Computer
0


జొమాటో పబ్లిక్ లిస్టింగ్ లోకి వెళ్లడం కంటే ముందు ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు, బోర్డు ఆయనకు కొన్ని ఈఎస్ఓపీ (ఎంప్లాయిమెంట్ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్) లను ఇచ్చాయి. వీటిల్లో కొన్నింటి గడువు తీరిపోవడంతో ఆ షేర్లను గోయల్ విక్రయించనున్నారు. గత నెల ఉన్న సగటు షేరు ధర ప్రకారం ఈ ఈఎస్ఓపీల విలువ భారత కరెన్సీలో దాదాపు రూ. 700 కోట్లు ఉంటుంది.. అయితే ఈ షేర్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని జొమాటో ప్యూచర్ ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వనున్నట్లు గోయల్ తెలిపారు. ఈ మొత్తాన్ని జొమాటోలో పనిచేసే సిబ్బంది, డెలివరీ భాగస్వాముల పిల్లలకు వినియోగిస్తానని తెలిపారు. గోయల్ ప్రకటించిన నిబంధనల ప్రకారం ఐదేళ్లు జొమాటోలో డెలివరీ భాగస్వాములుగా పనిచేస్తున్నట్లయితే వారి పిల్లల చదువుకోసం ఏడాదికి రూ. 50వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఒకవేళ సదరు ఉద్యోగి కంపెనీలో 10 ఏళ్లు పూర్తిచేసుకున్నట్లయితే వారి పిల్లల చదువుకోసం ఏడాదికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు గోయల్ ప్రకటించారు. అదే విధంగా మహిళా డెలివరీ భాగస్వాములకు సర్వీసు నిబంధన ఇంతకంటే తక్కువేనని గోయల్ వెల్లడించారు. డెలివరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవ శాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని, ఇందుకుగాను సర్వీసుతో సంబంధం లేదని గోయల్ ప్రకటించారు. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోలో గోయల్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)