మంచి నీటి కటకటలాడుతున్న గ్రామాలు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లాలోని ఖుస్రా గ్రామంలో ఏ ఒక్క ఇంటికి నల్లా కనెక్షన్ లేదు. ఊరవతల కిలో మీటర్లు దూరంలో ఎక్కడో అడవిలో ఉన్న చిన్ననీటి కాలువే ఖుస్త్రా గ్రామానికి నీటి ఆధారం. గ్రామంలో ప్రతి ఇంటినుంచి ఒకరికి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకురావటమే పని. గుక్కెడు నీళ్ల కోసం కూడా కిలో మీటర్ల దూరం నడవాల్సివస్తోందని.. కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ నేన్ సింగ్ ఠాకూర్ చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కూడా దాదాపు ఇలాంటి పరిస్ధితే ఉంది. 300 మంది నివసించే దండిచి బారి గ్రామ ప్రజలు వర్షాకాలంలో వానలపై ఆధారపడి జీవిస్తున్నారు. వానలు కురిసినప్పుడు వ్యవసాయం, మిగిలిన సమాయాల్లో కాంట్రాక్టు పనులపై ఆధార పడుతున్నారు. గ్రామంలో వున్నా ఒక్క బావి కూడా ఎండిపోవటంతో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత గ్రామంలోని మహిళలు నీరు తీసుకురావటానికి దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ముప్పావు గంట నడిచి వెళ్తే గానీ నీరు దొరకని పరిస్ధితి ఏర్పడింది. నీటి సమస్యతో ఇతర గ్రామ ప్రజలు తమ ఆడ పిల్లలను ఈ ఊరి మగ పిల్లలకు ఇచ్చి పెళ్లి చేయటానికి వెనుకంజ వేస్తున్నారు. దండిచి బారి గ్రామం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. తద్వారా సంవత్సరం పొడుగునా బావుల్లో నీరు నిల్వ ఉంచటం కష్టం అవుతోందని స్ధానిక పరిపాలనా అధికారి దీపక్ తెలిపారు. ఒక మహిళ ఆ గ్రామానికి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చింది. నీటి సౌకర్యం లేక పోవటంతో రెండు రోజుల్లోనే ఆమె తన భర్తను విడిచి వెళ్లిపోయిందని గ్రామస్తులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)