వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ సోకింది. పిల్లలకు రక్తమార్పిడి చేసిన అనంతరం హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. నలుగురు చిన్నారుల్లో ఒకరు మరణింగా.. ముగ్గురు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే తక్షణ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్కే ధాకటే వెల్లడించిన వివరాల ప్రకారం తలసేమియా అనే రక్త రుగ్మతతో బాధపడుతున్న పిల్లలకు బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి తీసుకువచ్చిన రక్తాన్ని వైద్యులు ఎక్కించారు. వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు రక్తం ఎక్కించిన తర్వాత హెచ్‌ఐవీ సోకింది. హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన చిన్నారుకు చికిత్సనందిస్తుండగా ఒకరు మృతి చెందారు. ఈ ఘటనకు బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)