ఉత్తరప్రదేశ్‌లో లౌడ్‌ స్పీకర్ల తొలగింపు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 1 May 2022

ఉత్తరప్రదేశ్‌లో లౌడ్‌ స్పీకర్ల తొలగింపు


ఉత్తరప్రదేశ్‌ లోని వివిధ ప్రార్థనా మందిరాల నుంచి ఆదివారం వరకూ 53,942 లౌడ్‌స్పీకర్లను తొలగించినట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. 60,295 లౌడ్ స్పీకర్ల సౌండ్‌ను స్థాయీ ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించినట్టు ఆయన చెప్పారు. అక్రమ లౌడ్‌స్పీకర్లను తొలగించాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏప్రిల్ 24న ప్రకటించింది. దీనిపై స్థాయీ నివేదకను అన్ని జిల్లాల నుంచి కోరినట్టు హోం శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవినాష్ కుమార్ తెలిపారు. మతపెద్దలతో చర్చించి, వారి సమన్వయంతో అనుమతి లేని లౌడ్‌స్పీకర్ల తొలగించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

No comments:

Post a Comment