సెకండ్‌, బూస్టర్‌ డోస్‌ మధ్య గ్యాప్‌ను తగ్గింపు ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 4 May 2022

సెకండ్‌, బూస్టర్‌ డోస్‌ మధ్య గ్యాప్‌ను తగ్గింపు ?


కరోనా వ్యాక్సిన్‌ రెండో టీకా, బూస్టర్‌ డోస్‌ మధ్య గ్యాప్‌ను తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ సైంటిఫిక్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగనున్నది. ప్రస్తుతం రెండో డోస్‌ తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతనే బూస్టర్‌ డోస్‌ వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గ్యాప్‌ను ఆరు నెలలకు తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ డేటాను చర్చించనున్నది. ఎన్‌టీఏజీఐ సభ్యులు రెండో డోస్‌ తీసుకున్న తర్వాత వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేలా రోగ నిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో ఈ డేటా ద్వారా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం అనేక దేశాలు అంతర్జాతీయంగా ప్రయాణించే వ్యక్తుల నుంచి బూస్టర్‌ డోస్‌ సర్టిఫికెట్‌ను కోరుతున్నాయని మంత్రిత్వశాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో పలువురు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆశ్రయిస్తున్నారు. రెండో డోస్‌, ప్రికాషనరీ డోస్‌కు మధ్య తొమ్మిది నెలల గ్యాప్‌ ఉండడంతో చాలా మంది బూస్టర్‌ డోస్‌ తీసుకోలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు రెండు, మూడో డోస్‌ టీకాల మధ్య గ్యాప్‌ను చాలా వరకు తగ్గించాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం సైతం త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు మాత్రమే బూస్టర్‌ డోస్‌గా వేస్తుండగా ఈ రెండు వ్యాక్సిన్లకు వైరస్‌తో పోరాడే సామర్థ్యం దాదాపు ఎనిమిది నెలలపాటు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌లో బూస్టర్‌ డోస్‌ ఇంతకు ముందు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి మాత్రమే వేయగా.. ఆ తర్వాత వృద్ధులను ఈ జాబితాలో చేర్చారు. 

No comments:

Post a Comment