వైసీపీదే దుగ్గిరాల ఎంపీపీ పీఠం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక హైడ్రామా మధ్య ముగిసింది. గతేడాది జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీకి మెజారిటీ స్ధానాలు లభించినా అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈ ఎన్నికను తమవైపు మలచుకుంది. దీంతో వైసీపీ ఎంపీపీ అభ్యర్ధిగా నిలబెట్టిన సంతోషి రూపవాణి ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన దుగ్గిరాల ఎంపీపీ పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 18 సీట్లకు గానూ టీడీపీకి 9, వైసీపీకి 8, జనసేనకు 1 సీటు దక్కింది. అయితే ఇక్కడ సీఎం జగన్ ఉండే మంగళగిరి నియోజకవర్గం పరిధిలో దుగ్గిరాల కూడా ఉండటంతో ఇక్కడ వైసీపీ ఓడితే విపక్ష టీడీపీ అది జగన్ ఓటమిగా ప్రచారం చేసే అవకాశం ఉండటంతో అధికార పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ముందుగా బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఎంపీపీ స్ధానానికి పోటీ పడుతున్న టీడీపీ ఎంపీటీసీని బీసీ ధృవపత్రం ఇవ్వకుండా అనర్హురాలిని చేసిన అధికార పార్టీ ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీ నుంచి గెలిచి ఎంపీపీ స్ధానానికి పోటీ పడుతున్న పద్మావతి అనే మరో ఎంపీటీసీని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. నిన్న ఎమ్మెల్యే ఆర్కేతో పాటు క్యాంప్ కు వెళ్లిన పద్మావతి ఇవాళ ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో వైసీపీ పన్నాగం అర్ధమైంది. చివరికి కేవలం ఐదుగురు సభ్యుల మద్దతు మాత్రమే ఉన్న వైసీపీ ఎంపీటీసీ సంతోషి రూపవాణి మినహా మరో అభ్యర్ధి మూడు పార్టీల్లోనూ దొరకలేదు. దీంతో ఏకైక బీసీ మహిళ అయిన రూపవాణి ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. రెండు వైస్ ఎంపీపీ సీట్లను టీడీపీ, జనసేన చెరొకటి దక్కించుకున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)