చత్వారం చెక్ పెట్టే 'వ్యూటీ' ఐ డ్రాప్స్ !

Telugu Lo Computer
0


కళ్లు సరిగ్గా కన్పించక ఐ సైట్ తో ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఐ డ్రాప్స్ అందుబాటులోకి వచ్చింది. కంటి చూపు సరిగాలేని వారు కళ్లజోడు కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చుక్కల మందు రూపంలో అందుబాటులోకి వచ్చిన దీన్ని కంటిలో వేసుకున్న 15 నిమిషాలకే కళ్లలో మసకపోయి కంప్యూటర్, ఫోన్ తెరలను స్పష్టంగా చూడగలుగుతారు. అలాగే పుస్తకాలు, పేపర్లను చదువుకోగలుగుతారు. నిజానికి 40 ఏళ్లు వచ్చాక చాలామందిలో చత్వారం వస్తుంది. ఇదొచ్చిన వారు కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకాలు చదవలేరు. దీంతో ఇలాంటి వారి కోసం 'వ్యూటీ' చుక్కల ముందు అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ  దీనికి అనుమతినిచ్చింది. కన్ను పనిచేసే తీరును బట్టి ఈ చుక్కల మందు పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌డీఐ అనుమతితో చత్వారాన్ని సరిచేసే మొట్టమొదటి చుక్కల మందుగా 'వ్యూటీ' రికార్డులకెక్కింది.


Post a Comment

0Comments

Post a Comment (0)