అతిపురాతన 'నాగాభరణ శివలింగం' స్వాధీనం

Telugu Lo Computer
0


చెన్నై త్రిశూలంలోని కార్గో కేంద్రం నుంచి అమెరికాకు పంపించాల్సిన సరుకులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా, వాటిల్లో 1,800 ఏళ్లనాటి అతి ప్రాచీనమైన శివలింగం బయల్పడింది. దానికి సంబంధించిన ఎగుమతి పత్రాలు పరిశీలించగా, అది తంజావూరు జిల్లా కుంభకోణంలో ఉన్న హస్తకళా విక్రయ కేంద్రంలో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అయితే దానికి పురావస్తు పరిశోధన శాఖ అనుమతి పత్రం లేదు. 36 సెం.మీ ఎత్తు, 4.56 కిలోల బరువుతో కూడిన ఈ పంచలోహ విగ్రహం తమిళనాడులోని  కళ్లకుర్చి జిల్లా తిరునావలూరు సమీపంలోని కొడివలం అనే గ్రామానికి చెందినదని విచారణలో తేలింది. ఇది ప్రాచీనమైన శివలింగంగా గుర్తించినట్లు కస్టమ్స్‌ శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ కేఆర్‌ ఉదయభాస్కర్‌ తెలిపారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)