రసాయన అవశేషాలతో తగ్గుతున్న సంతానోత్పత్తి

Telugu Lo Computer
0



జాతీయ వంధ్యత్వ అవగాహన వారం లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సంస్థ నిర్వహించిన సదస్సులో పలువురు వైద్యనిపుణులు ప్రసంగించారు. దేశంలో 27.5 మిలియన్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయని, ప్రతి జంటలో సంతానోత్పత్తి రేటు 2.1కు పడిపోయిందని వైద్యనిపుణులు వెల్లడించారు. ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్‌ జలగం కావ్య మాట్లాడుతూ ప్రధానంగా గ్రామీణప్రాంతాల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిన ట్టు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. వీరిలో 99 శాతం మంది వ్యవసాయపనులు చేసేవారే ఉన్నారని, పురుషుల్లో శుక్రకణాలపై పురుగుమందుల అవశేషా లు ప్రభావం చూపుతున్నట్టు తేలిందని వివరించారు. పురుగు మందుల్లోని రసాయనాలు శుక్రకణాల డీఎన్‌ఏను దెబ్బతీస్తున్నాయని, దీంతో టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గిపోయి సంతానలేమి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక సమస్యలున్న వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటున్నదని తెలిపారు. రసాయనాలతో పండించిన పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కూడా సంతానలేమి సమస్య ఉత్పన్నమవుతున్నదని వివరించారు. మహిళల్లో అబార్షన్లు, పిండం సరిగా ఎదగపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)