మద్రాస్ హైకోర్టు వింత తీర్పు !

Telugu Lo Computer
0


ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్ మీద పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్న యువకుడిపై కేసు ఫైల్ అయింది. అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అతని మానసిక పరిస్థితిలో మార్పు రావాలని కోర్టు వింతైన తీర్పు ఇచ్చింది. చెన్నైలో ఉన్న గవర్నమెంట్ స్టాన్లీ హాస్పిటల్ ట్రామా కేర్ సెంటర్ లో 30రోజుల పాటు వార్డ్ బాయ్ గా పనిచేయాలని సూచించింది. దాంతో పాటు రోజు మొత్తంలో తాను చేసిన పనిని నోట్స్ లా రాసుకుని తీసుకురావాలని చెప్పింది. డ్యూటీ డాక్టర్ రావడానికి అంటే ఉదయం 8గంటల కంటే ముందే వచ్చి మధ్యాహ్నం వరకూ వార్డ్ బాయ్స్ కు సహాయం చేయాలని ప్రవీణ్ అనే వ్యక్తికి జస్టిస్ జీ జయా చంద్రన్ సూచించారు. రోజూ డ్యూటీ అనంతరం డైలీ రిపోర్ట్ రాసి హాస్పిటల్ డీన్ తో సంతకం చేయించుకుని జార్జ్ టౌన్ లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కు సమర్పించాలని చెప్పారు. "ఇటీవల యువకులు తమ వాహనాలను హడావిడిగా నడుపుతున్నారనే వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. ఇది రహదారి వినియోగదారుల మనస్సులలో, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల మనస్సులలో భయాందోళనలను కలిగిస్తుంది. రైడర్లు కూడా లోహపు కడ్డీలను ఉపయోగించి అగ్ని మెరుపులను కలిగించడం ద్వారా ప్రజల మనస్సులలో భయాందోళనలను సృష్టిస్తారు. రైడర్లు వీలింగ్, ఇతర సాహసాలు కూడా చేస్తారు, "అని ర్యాష్‌గా డ్రైవింగ్ చేసి వాహనదారుల భద్రతకు హాని కలిగిస్తున్నారని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)