మధురవాడలో వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు

Telugu Lo Computer
0


విశాఖలోని మధురవాడలోని వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన నిర్మాణ కంపెనీపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. మధురవాడ సర్వే నెంబర్ 225లో కాలువపై కట్టిన కల్వర్ట్ ని అనధికారిక నిర్మాణంగా గుర్తించారు. రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు రస్తాగా నమోదు అయింది. సర్వే నెంబర్ 89లోని తాత్కాలిక నిర్మాణంగా గుర్తించి తొలగింపునకు ఆదేశాలు జారీచేశారు. ఎండాడ సర్వే నెంబర్ 67లో చెరువు పోరంబోకు ఆక్రమణలకు గురైనట్టు నిర్ధారణకు వచ్చారు అధికారులు.10 సెంట్ల భూమిలో రోడ్డు, ఇతర నిర్మాణాలు వున్నట్టు గుర్తించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలపై విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. భీమిలి రెవెన్యూ డివిజన్ అధికారులు విచారణ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. వివాదాస్పద భూములపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఉన్నాయని భీమిలి ఆర్.డి. ఓ. భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ వివాదంపై తీవ్రంగా స్పందించిన ఎంపీ ఎంవీవీ ఇక నుంచి వైజాగ్ లో కనస్ట్రక్షన్ ప్రాజెక్ట్ లు చేపట్టబోనన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)