హెచ్‌సీఎల్‌ ఆధ్వర్యంలో సముద్రతీర ప్రక్షాళన

Telugu Lo Computer
0


చెన్నై నగరంలోని సముద్రతీరాన్ని శుభ్రం చేసేందుకు హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ చర్యలు చేపట్టింది. మెర్క్‌ ఏఎంఎస్‌ డెలివరీ సంస్థ సహకారంతో ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'హెచ్‌సీఎల్‌ హరిత్‌' పేరుతో 'డైవ్‌ టు రిట్రీవ్‌' నినాదంతో ప్రక్షాళన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ మేరకు ప్రియాంక, డాక్టర్‌ షబ్బీర్‌ అనే స్విమ్మర్లను రంగంలోకి దింపి సముద్రతీరం అడుగుభాగాన నెలల తరబడి పడిఉన్న వలలను, వ్యర్థపదార్థాలను వెలికి తీయించారు. ఈ వలల కారణంగా సముద్రంలో కాలుష్యం అధికమై జలచరాల ప్రాణాలకు హాని చేకూరుతాయని హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ నిధి పుందీర్‌ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మెర్క్‌ ఏఎంఎస్‌ డెలివరీ సంస్థ డైరెక్టర్‌ ఏకే విజయానంద్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 57 వేల కేజీల బరువైన వలలు, చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)