పాన్‌ మసాల స్టార్స్‌ !

Telugu Lo Computer
0


సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు నవ్విస్తే మరి కొన్ని పోస్టులు చిరాకును తెప్పిస్తుంటాయి. మరి కొన్ని పోస్టులు చిత్ర విచిత్రమైన తీరుతో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతాయి. అందులో ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన మీమ్స్‌ పోస్టులు తెగ వైరల్‌ అవుతాయి. ఇటివల పాన్‌ ఇండియా స్టార్స్‌, పాన్‌మసాల స్టార్స్‌ కు సంబంధించిన ఓ మీమ్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. పలువురు తెలుగు హీరోలు, కన్నడ హీరోలు పాన్‌ ఇండియా సినిమాల్లో నటించి సినిమాల గౌరవం పెంటచుతుంటే మరో వైపు బాలీవుడ్‌ హీరోలు పాన్‌ మసాల ప్రకటనలు చేసి సినీ రంగాన్ని దిగజార్చుతున్నారని చేసిన ఈ మీమ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ మీమ్‌ను చూసిన నెటిజన్లు షేర్స్‌, కామెట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైవు బాలీవుడ్‌ హీరోల అభిమానులు అదే సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరేమో పాన్‌ మసాల ప్రకటనలో నటించడం తప్పే కానీ ఎవ్వరినీ కించపర్చరాదని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్‌ రూపంలో అంటున్నారు. ఈ అంశంపై స్పందించిన పలువురు నెటిజన్లు బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా పాన్‌ మసాల యాడ్స్‌ చేసే హీరోలున్నారని హీరో మహేష్‌ బాబు ఫోటోలను పోస్ట్‌ చేశారు. దీంతో ఈ పోస్ట్‌ హట్ టాఫిక్‌గా మారింది. మహేష్‌ బాబు అభిమానులు స్పందిస్తూ..పోస్ట్‌ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మీమ్ పోస్ట్‌కు 10 వేలకు పైగా నెటిజన్లు లైక్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)