శ్రీలంకలో మిన్నంటిన ప్రజాందోళన

Telugu Lo Computer
0



శ్రీలంకలో ప్రజల ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో శ్రీలంక ప్రజలు అధ్యక్షుడు రాజ్‌పక్సే ఇంటిని చుట్టిముట్టారు. అధ్యక్షుడు రాజ్‌పక్సే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారిపై పోలీసులు వాటర్ కెనాన్లతో పాటు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో అధ్యక్షుడు రాజ్‌పక్సే ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. శ్రీలంక ఆర్థిక ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. జల విద్యుత్ కొరతతో ఆ దేశం విద్యుత్ కోతలు ఎదుర్కొంటోంది. ఇక నుంచి విద్యుత్ ఆదా చేసేందుకు విధి దీపాలను కూడా నిలిపివేయనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. విద్యుత్ ఆదా చేసేందుకు దేశవ్యాప్తంగా వీధి దీపాలను నిలిపివేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని విద్యుత్‌శాఖ మంత్రి తెలిపారు. 5 వందల మిలియన్ డాలర్ల రుణం కింద భారత్ నుంచి శనివారం డిజిటల్ షిప్‌మెంట్ రానుందని మంత్రి అంచనా వేశారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని హెచ్చరించారు. వానలు పడేవరకు ఈ పరిస్థితి ఉండొచ్చన్నారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పడిపోవడంతో ఆ దేశంలో జల విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)