కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శంకర నారాయణన్ కన్నుమూత

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.శంకర నారాయణన్ (89) కేరళ పాలక్కడ్‌లోని ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఏడాదిన్నరగా ఆయన చికిత్స పొందుతున్నారు. శంకర్ నారాయణ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలుమార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేరళ ప్రభుత్వంలో ఎక్సైజ్, ఆర్థిక, వ్యవసాయ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. మహారాష్ట్ర, నాగాలాండ్, జార్ఖండ్, గోవా రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన భౌతిక కాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. శంకర నారాయణన్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా పలువురు సంతాపం ప్రకటించారు. లౌకికవాదంతో, నెహ్రూ దృక్పథంతో శంకర నారాయణన్ పనిచేశారని, యూడీఎఫ్ కన్వీనర్‌గా సుదీర్ఘ కాలం కొనసాగారని విజయన్ గుర్తుచేసుకున్నారు. ప్రజా సమస్యల పట్ల ఆయనెప్పుడూ సానుకూల దృక్పథంతో వ్యవహరించేవారని అన్నారు. శంకర నారాయణ్ మృతి కేరళకు, దేశానికి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. శంకర్ నారాయణన్ పరిపాలనా అనుభవజ్ఞుడని.. సామాజిక నిబద్దత కలిగిన వ్యక్తిని అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)