కొరటాల శివ మొట్టమొదటి ప్లాప్ ను అందుకున్నాడా ?

Telugu Lo Computer
0


టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ‘మిర్చి’ దగ్గర నుంచి ‘భరత్ అనే నేను’ వరకు కొరటాల అంటే మార్క్ అనేలా తెరక్కించాడు. ఇక ఆ లిస్ట్ లోనే ఆచార్య కూడా వెళ్తోంది.. అదే మార్క్ ను ఆచార్య లో చూపిస్తాడు అనుకున్న ప్రేక్షకులను కొరటాల నిరాశపరిచాడు అనేది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం నేడు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ప్రేక్షకుల అంచలనాలను కొరటాల అందుకోలేకపోయాడు అని అంటున్నారు అభిమానులు. చిరు, చరణ్ ల పై పెట్టిన దృష్టి కొంచెం కథ మీద కూడా పెట్టి ఉంటే బావుంటుంది అంటున్నారు. కొరటాల సినిమాలు అంటే ఎవరో ఒకరు మొదలుపెట్టిన కార్యాన్ని హీరో వచ్చి పూర్తి చేస్తాడు. ఇక ఇదే తరహాలో ఆచార్య కూడా చూపించేశాడు అంటున్నారు. నక్సలైట్ లుగా ఉన్న చిరు, చరణ్ లిద్దరు ధర్మస్థలిని కాపాడే ప్రయత్నం చేయడమే తప్ప వారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనడానికి బలమైన కారణం చూపించలేకపోయాడు అని, ఊర మాస్ సన్నివేశాలను కామెడీ చేసిపడేశాడని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక భావోద్వేగాలు పండించడంలో తిరుగులేని చిరంజీవికి ఆ అవకాశమే ఇవ్వకుండా కేవలం ఫైట్లు చేయించడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు చిరుతో సినిమా అంటే ఏ దర్శకుడైనా ఆయన ఎనర్జీని అన్ని రకాలుగా ఎలా వాడుకోవాలని చూస్తాడు. కానీ, కొరటాల మాత్రం చిరును పూర్తిగా వాడుకోలేదని, చిరు సైతం కొరటాల చెప్పినట్లు చేయడం తప్ప ఎక్కువ ఆలోచించలేదని తెలుస్తోంది. దీంతో మూడు గంటలు ప్రేక్షకులకు నీరసం తెప్పించిందని, కొరటాల నుంచి ఇలాంటి ఒక కథను ఊహించలేదని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి అపజయం ఎరుగని దర్శకుడు ఆచార్య తో మొదటిసారి పరాజయాన్ని మూట కట్టుకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతోనైనా ప్రేక్షకుల అభిరుచి ఏంటి అనేది కొరటాల శివ తెలుసుకోవాలని అభిమానులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)