అరటి పండు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


అన్ని సీజన్ లో దొరికే పండు  అరటి పండు.   అరటి పండును మనం ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. వ్యాయామం, యోగా చేసే పురుషులు అరటిపండుతో నెయ్యి కలుపుకుని పరగడుపున తినడం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయని కొన్ని అధ్యయనాలు తెలియజేయడం జరిగింది. చాలా తేలికగా ఉన్న వారు ఉదయం పూట పరగడుపున అరటిపండులో నెయ్యిని కలుపుకొని తినడం వల్ల బరువు పెరగవచ్చు. అంతే కాకుండా కండరాలు కూడా దృడంగా మారుతాయి. ప్రతిరోజు వ్యాయామం, యోగా చేసేవారు కచ్చితంగా అరటిపండు , నెయ్యి తినడం వల్ల వారికి తక్షణ శక్తి లభిస్తుందట. అరటి పండ్లలో ఫైబర్ ఉండటం వల్ల ఇది మన జీర్ణక్రియ వ్యవస్థ ను బాగా మెరుగుపరుస్తుంది. ఇక అంతే కాకుండా ఎలాంటి ఆహారాన్ని అయినా జీర్ణమయ్యేలా చేస్తూ ఉంటుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటిపండు, నెయ్యి కలుపుకుని తింటే .. సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇక అంతే కాకుండా అసిడిటీ వంటి సమస్య నుండి కూడా విముక్తి పొందవచ్చు. ఎక్కువగా అలసట పడేవారు, శ్రమ అధికంగా చేసేవారు అరటిపండు నెయ్యి కలుపుకుని తింటే చాలా హుషారుగా ఉంటారు. లైంగిక సమస్యలతో ఇబ్బంది పడే పురుషులు.. ఇది ఒక మంచి మెడిసన్ గా పనిచేస్తుంది. అరటిపండు తినడం వల్ల వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతోంది. చర్మ కాంతి బాగా మెరుగు పడాలంటే వీటిని ప్రతిరోజు తింటూ ఉండాలి..

Post a Comment

0Comments

Post a Comment (0)