వివాహానికి ఆహ్వానించిన నంద్యాల జేసీ

Telugu Lo Computer
0


నంద్యాల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, సత్యనారాయణరెడ్డిల వివాహం 14న కడపలోని మాధవి కన్వెన్షన్‌ హాలులో జరగనుంది. మౌర్య సొంత గ్రామం చాపాడు మండలంలోని నాగులపల్లె. ఆమె తల్లిదండ్రులు నారపురెడ్డి చంద్ర ఓబుళరెడ్డి, జయశ్రీ వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. సత్యనారాయణరెడ్డి సొంత గ్రామం కడపలోని చిన్నచౌకు. ఆయన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పనిచేస్తున్నారు. మౌర్య, ఆమె తల్లిదండ్రులు బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి జగన్‌ను వివాహానికి ఆహ్వానించారు. సీఎం తప్పకుండా పెళ్లిరోజు లేదా తెల్లవారి ఏర్పాటు చేసే ఫంక్షన్‌కు వస్తానన్నారని చంద్ర ఓబుళరెడ్డి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)