సాధికారత యాక్షన్ గ్రూప్‌-2024

Telugu Lo Computer
0


వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకు గాను ఎన్నికల సాధికారత కమిటీని నియమించింది. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రూట్ మ్యాప్‌పై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్లు అధినేత్రి సోనియా ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సాధికారత కమిటీని అధినేత్రి ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. అయితే వ్యూహకర్త పీకేకి పార్టీలో ఎలాంటి బాధ్యతలిస్తారు? అని ప్రశ్నించగా ఆ ప్రశ్నను దాటవేశారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ నవసంకల్ప్ చింతన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సూర్జేవాలా వెల్లడించారు. మే 13 నుంచి 15 వరకూ ఈ శిబిరం జరుగుతుంది. దీనికి 400 మంది ప్రతినిధులు వస్తారని ఆయన వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను చిదంబరం కమిటీ అధ్యయనం చేసిందని, ఈ నివేదికను సోనియాకు సమర్పించారని సూర్జేవాలా ప్రకటించారు. ఈ రిపోర్టుపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. దీని ఆధారంగా సాధికారత యాక్షన్ గ్రూప్‌-2024 గ్రూపును ఏర్పాటు చేశారని సూర్జేవాల వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)