'ఆర్ ఆర్ ఆర్' పార్టీలో అనుష్క! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 28 March 2022

'ఆర్ ఆర్ ఆర్' పార్టీలో అనుష్క!


'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ పార్టీ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పార్టీలో పాల్గొన్నారు. చరణ్ ఉపాసన, రాజమౌళి, రమా, కార్తికేయ, కీరవాణీ ఫ్యామిలీ తో పాటు దిల్ రాజు వంశీ పైడిపల్లి ఇలా కొంత మంది ప్రముఖుల్ని జక్కన్న అండ్ కో ఆహ్వానించి గ్రాండ్ గా పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ పార్టీలో అనుష్క కూడా తళుక్కున మెరిసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'ఆర్ ఆర్ ఆర్' పార్టీ కోసం అనుష్క బెంగుళూరు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. స్వయంగా రాజమౌళి ఫోన్ చేసి పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆయన ఆహ్వానాన్ని అనుష్క కాదనలేక పార్టీకి తప్పక హాజరైటనట్లు సమాచారం. ఈపార్టీ కి అనుష్క ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా వచ్చేసారు. వైట్ కలర్ క్యాజువల్ వేర్స్ లో కనిపిస్తున్నారు. అలాగే ముక్కుని..నోటిని కవర్ చేస్తే ఎన్ 95 వైట్ కలర్ మాస్క్ ధరించారు. రామ్ చరణ్...రమాలతో మాట్లాడుతున్నట్లు ఫోటో చూస్తే తెలుస్తోంది. ఈ పార్టీకొచ్చిన వారిలో కొంత మందే మాస్క్ ధరించడం గమనార్హం. చాలా మంది మాస్క్ లు లేకుండా పార్టీలో కనిపించారు. కోవిడ్ రూల్స్ ని అనుష్క తూచ తప్పకుండా పాటించినట్లు కనిపిస్తుంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ కోవిడ్ గురించి ఓ అవేర్ నెస్ యాడ్ లో కనిపించారు. కానీ పార్టీలో రామ్ చరణ్ ఎలాంటి మాస్క్ ధరించలేదు. ఇక పార్టీకి తారక్ ఎలాగూ హాజరు కాని సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ మొత్తంలో అనుష్క హైలైట్ అవుతుంది. బెంగుళూరు నుంచి రావడంతో ఆమె గురించే సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. అనుష్క రెండు..మూడేళ్లగా టాలీవుడ్ లో సరిగ్గా కనిపించని సంగతి తెలిసిందే. కొన్నాళ్లగా బెంగుళూరులో కుటుంబ సభ్యులతోనే ఉంటుంది. అవసరం మేర హైదరాబాద్ రావడం పని ముగించుకుని తిరుగు ప్రయాణం జరుగుతుంది. తాజాగా పార్టీ కోసమే బెంగుళురు నుంచి విచ్చేసినట్లు తెలుస్తోంది. అనుష్క చివరిగా 'సైలెన్స్'సినిమాలో నటించింది. రెండేళ్ల క్రితం ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రచారం సమయంలోనే హైదరాబాద్ లో కనిపించింది. ఆ తర్వాత మరోసారి ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చింది. మళ్లీ స్వీటీ మీడియా కంట పడటం ఇదే కావడం విశేషం. 

No comments:

Post a Comment