ఉత్తరప్రదేశ్ లో మరో మూడు నెలలు ఉచిత రేషన్!

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో మరో 3 నెలల పాటు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ నిర్ణయించారు. 2020 లో దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైన సమయంలో దేశ ప్రజలను ఆదుకోడానికి కేంద్రం ఈ ఉచిత రేషన్‌ను ప్రారంభించింది. లఖ్‌నవూలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని, ఇది కొత్త కేబినెట్ తీసుకున్న మొదటి నిర్ణయమని యోగి వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)