జొమాటో ద్వారా పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ!

Telugu Lo Computer
0


జొమాటో 10నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తామంటూ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయెల్ ట్విట్టర్ వేదికగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రకటించారు. ‘జొమాటోలో పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ ఫీచర్ రానుంది’ అని ట్వీట్ చేశారు. ఈ ప్రాసెస్‌ను జొమాటో ఇన్‍స్టంట్ అని పేరు పెట్టారు. ఈ ట్వీట్ తో పాటు జొమాటో అఫీషియల్ బ్లాగ్ నుంచి ఒక పోస్టు రిలీజ్ చేశారు. ‘అసాధ్యం కాని దానిని సాధిస్తాం. అది కూడా డెలివరీ పార్టనర్ సేఫ్టీతో’ అని పేర్కొన్నారు. ‘దీని కోసం డెలివరీ పార్టనర్లను ఎటువంటి ఒత్తిడికి గురి చేయాలనుకోవడం లేదు. లేట్ డెలివరీ చేశారని వారికి పెనాల్టీ కూడా వేసేది లేదు. ప్రామిస్ చేసిన టైంకే డెలివరీ ఇవ్వాలని లేదు. రోడ్ మీద పరిస్థితులకు అనుగుణంగా టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది’ అని దీపిందర్ అన్నారు. అయితే ఈ వివరణతో ట్విట్టర్ యూజర్లు సంతృప్తిపడినట్లుగా అనిపించలేదు. సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడి జరుగుతూనే ఉంది జొమాటోపై. ఫుడ్ డెలివరీ పేరిట డెలివరీ చేసే వ్యక్తులతో పాటు రోడ్ మీద ఉండే వాళ్ల ప్రాణాలతో రిస్క్ చేస్తున్నట్లే అవుతుంది. స్విగ్గీ లాంచ్ చేసిన ఇన్‌స్టామార్ట్ సర్వీస్ తర్వాత జొమాటో కూడా10 నిమిషాల్లో గ్రోసరీ డెలివరీ సర్వీస్ లాంచ్ చేసింది. ఇది దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది కూడా.

Post a Comment

0Comments

Post a Comment (0)